క్రైస్తవుల పవిత్ర గ్రంధమైన బైబిల్లో అనేక పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధన, పాత నిబంధన అని రెండు విభాగాలు కలవు. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. వీటిలో 929 అధ్యాయాలు ఉన్నాయి. 23,214 వచనాలు ఉన్నాయి. 5,93,393 పదాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో పెద్ద పుస్తకం 'కీర్తనలు'. చిన్న పుస్తకం 'ఒబద్యా' . పెద్ద అధ్యాయం 119వ కీర్తన. చిన్న అధ్యాయం 117వ కీర్తన. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 260 అధ్యాయాలు, 7,959 వచనాలు ఉన్నాయి. 1,81,253 పదాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో పెద్ద పుస్తకం 'అపోస్తులు కార్యములు'. చిన్న పుస్తకం 'యోహాను 3వ పత్రిక.'పెద్ద అధ్యాయం లూకా సువార్త మొదటి అధ్యాయం. నూతన నిబంధన గ్రంథంలో 28 అధ్యాయాలు అపోస్తులు కార్యములలో ఉన్నప్పటికీ కేవలం 1,007 వచనాలే ఉన్నాయి. కాని లూకా సువార్తలో 24 అధ్యాయాలే ఉన్నప్పటికీ 1,151 వచనాలు, 25,944 పదాలు ఉన్నాయి.కనుక వాస్తవంగా లూకా సువార్తయే పెద్ద పుస్తకంగా భావించవలసి ఉంది.
Subscribe to:
Comments (Atom)


